Anchor Swetha Reddy: భక్తి సినిమాలు చేసిన నాగార్జున బూతు షో చేయొచ్చా?: యాంకర్ శ్వేతారెడ్డి

  • బిగ్ బాస్ నిర్వాహకులపై శ్వేతారెడ్డి ధ్వజం
  • హోస్ట్ గా నాగార్జున తప్పుకోవాలంటూ డిమాండ్
  • అగ్రిమెంట్ పేరుతో దగా చేస్తున్నారంటూ మండిపాటు

బిగ్ బాస్ రియాల్టీ షో నిర్వాహకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన యాంకర్ శ్వేతారెడ్డి మరోసారి గళమెత్తారు. బిగ్ బాస్-3 కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున వెంటనే ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. భక్తి సినిమాలు చేసిన నాగార్జున వంటి నటుడు బూతు షో చేయొచ్చా అంటూ నిలదీశారు. బిగ్ బాస్ షోలో అగ్రిమెంట్ పేరుతో మోసం చేస్తున్నారంటూ శ్వేతారెడ్డి మండిపడ్డారు. బిగ్ బాస్ షో అంతా వంచన అంటూ ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News