Andhra Pradesh: 109 మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తాం!: మంత్రి బొత్స

  • విలీన గ్రామాలపై టీడీపీ దృష్టి సారించలేదు
  • జీఎంసీ విలీన గ్రామాల్లో పరిస్థితి దారుణం
  • అసెంబ్లీలో మాట్లాడిన ఏపీ మున్సిపల్ మంత్రి

విలీన గ్రామాలపై గత తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి సారించలేదని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్(జీఎంసీ) లో విలీనం చేసే గ్రామాల పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారయిందని విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బొత్స మాట్లాడారు.

కేవలం గుంటూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చాలా మున్సిపల్ కార్పొరేషన్లలో ఇదే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించి ఎన్నికలు నిర్వహిస్తామని బొత్స చెప్పారు. కొన్ని కార్పొరేషన్లలో కోర్టుకేసులు ఉన్నాయనీ, వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 109 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.

Andhra Pradesh
ASSEMBLY
109 corporations
one time election
Botsa Satyanarayana
minister
  • Loading...

More Telugu News