anand mahindra: వంట చేసి పెట్టారా, ప్లీజ్‌... అన్న భార్యకు ఆసక్తికర పొటో పంపిన ఆనంద్‌ మహీంద్ర

  • ఇస్త్రీ పెట్టెతో రొట్టేలు తయారుచేస్తుండగా తీసిన ఫొటో
  • నేను వంట చేస్తే ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్
  • స్వయంగా ఈ అంశం ట్విట్టర్‌లో ఉంచిన వ్యాపార దిగ్గజం

సెలబ్రిటీలు, ప్రముఖులు ఏం చేసినా ఆసక్తిగాను, ఆకట్టుకునేలా ఉంటాయి. దేశీయ ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ట్విట్టర్‌లో ఉంచిన ఓ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే...వ్యాపార వ్యవహారాలతో క్షణం తీరికలేకుండా నిత్యం బిజీగా ఉండే మహీంద్ర గ్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్రను అతని భార్య తనకోసం ఓ రోజు వంట చేయాలని కోరింది. దీనికి ఆయన సున్నితంగా తిరస్కరించారు. అనంతరం ఓ వ్యక్తి ఇస్త్రీ పెట్టెతో రొట్టె కాలుస్తున్న ఫొటోను ట్విట్టర్‌లో ఉంచారు. ‘నేను వంట చేస్తే ఇలాగే ఉంటుంది’ అంటూ దానికింద రాశారు. దీనిపై నెటిజన్లు కూడా ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ‘ఓహో ఇలా చేస్తే మీ భార్య మరోసారి మిమ్మల్ని వంట గురించి అడగరు కదా... మీ ఆన్సర్‌ సూపర్‌ సార్‌’ అని ఒకరు, ‘ఎలక్ట్రిక్‌ కార్లతో పాటు ఎలక్ట్రిక్‌ చపాతీలను కూడా తయారు చేస్తారా సార్‌’ అంటూ మరొకరు కామెంట్‌ చేశారు.

anand mahindra
food
Twitter
chapathi made with iror box
  • Loading...

More Telugu News