Allu Arjun: ఓ అదృశ్య శత్రువా... ట్విట్టర్ లో అల్లు అర్జున్ పీఏ వార్నింగ్!

  • ఇటీవలి కాలంలో బన్నీ వైఖరిపై పుకార్లు
  • స్టార్ ఇమేజ్ డ్యామేజ్ కాబోదన్న ఎస్కేఎన్
  • 19వ సినిమా షూటింగ్ లో బిజీ అని వెల్లడి

ఇటీవలి కాలంలో హీరో అల్లు అర్జున్ పై ఎన్నో రూమర్స్ నెట్టింట హల్ చల్ చేశాయి. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తరువాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న బన్నీ, ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మరో మూడు సినిమాలనూ అంగీకరించాడు. ఇదే సమయంలో షూటింగ్ సమయంలో సహాయ దర్శకుడిని కొట్టాడని, బన్నీ డిమాండ్లతో ప్రొడ్యూసర్లు ఇబ్బందులు పడుతున్నారని వార్తలు రాగా, వీటిపై బన్నీ పీఆర్వో ఎస్కేఎన్ స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టాడు. "ప్రియ‌మైన అదృశ్య శ‌త్రువా.. 18 సంవత్సరాల పాటు ఎంతో క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న స్టార్ ఇమేజ్‌ ని కొన్ని వ్యతిరేక వార్తలు డ్యామేజ్ చేయలేవు. అత‌ని అంకిత భావం, సాయం చేసే తత్వం అభిమానులకు మరింత దగ్గరయ్యేలా చేస్తుంది. ఈ పోరాటంలో చివరికి ఎవ‌రు చిరునవ్వు నవ్వుతారో చూద్దాం. ప్ర‌స్తుతం బ‌న్నీ 19వ సినిమా షూటింగ్ లో ఉన్నారు. 20, 21వ సినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది" అని ఎస్కేఎన్ పేర్కొన్నాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News