Tirumala: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ!

  • వారాంతం తరువాత వేలాది మంది భక్తులు
  • దర్శనానికి 24 గంటల సమయం
  • నిన్న హుండీ ఆదాయం రూ. 3.05 కోట్లు

వారాంతం ముగిసిన తరువాత తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శని, ఆదివారాల తరువాత, ఈ ఉదయం వివిధ మార్గాల ద్వారా వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకోగా, సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లూ నిండి, క్యూలైన్ నారాయణగిరి ఉద్యానవనాన్ని దాటి బయటకు వచ్చింది. సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుందని, భక్తులు ఓపికతో వేచి చూడాలని అధికారులు అనౌన్స్ చేస్తున్న పరిస్థితి. క్యూలైన్లలో వేచి చూసేవారికి అన్న పానీయాలను అందిస్తున్నామని వారు తెలియజేశారు. కాగా, టైమ్ స్లాట్ టోకెన్ పొందిన భక్తులకు స్వామి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం నాడు 91,634 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని, హుండీ ఆదాయం రూ. 3.05 కోట్లని అధికారులు తెలిపారు. మరోవైపు నిన్న రాత్రి తిరుమలలో ఓ మోస్తరు వర్షం కురవడంతో అద్దె గదులు లభించక, బయట షెడ్లలో సేదదీరుతున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. 

  • Loading...

More Telugu News