Andhra Pradesh: జ్యోతుల నెహ్రూ గారూ.. కాపులకు ఎవరు ద్రోహం చేశారో మీ అంతరాత్మను అడగండి!: విజయసాయిరెడ్డి

  • పదవి, ప్యాకేజీ కోసం జాతి గౌరవాన్ని తాకట్టుపెట్టారు
  • రిజర్వేషన్లు కుదరవని తెలిసినా చంద్రబాబును పొగిడారు
  • ఇప్పుడు ఉసిగొల్పితే మమ్మల్ని విమర్శిస్తున్నారు

ఏపీ సీఎం జగన్ కాపులకు అన్యాయం చేస్తున్నారని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వలేమని జగన్ చేస్తున్న అన్యాయంపై పోరాడుతానని ఆయన ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. పదవి కోసం, ప్యాకేజీల కోసం జ్యోతుల నెహ్రూ తన జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విజయసాయిరెడ్డి విమర్శించారు.

కాపులకు ఎవరు ద్రోహం చేశారో అంతరాత్మను ప్రశ్నించుకోవాలని సూచించారు. అసాధ్యమని తెలిసినప్పటికీ కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని చంద్రబాబు చెప్పగానే ఆయన్ను జ్యోతుల నెహ్రూ పొగిడారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎవరు ఉసిగొల్పితే తమపై ఆయన విమర్శలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News