MS Dhoni: మిలిటరీ శాల్యూట్ చేస్తూ రాష్ట్రపతి వద్దకు ధోనీ... అచ్చం తనలాగే అంటూ వీడియో షేర్ చేసిన షెల్డన్ కోట్రెల్!

  • వెస్టిండీస్ బౌలర్ గా ఉన్న కోట్రెల్
  • గతంలో ధోనీకి లెఫ్టినెంట్ కల్నల్ గా గౌరవ హోదా
  • ఆ వీడియోను షేర్ చేస్తూ పొగడ్తలు

షెల్డన్ కోట్రెల్... గడచిన వరల్డ్ కప్ పోటీల్లో వెస్టిండీస్ మ్యాచ్ లను చూసిన వారెవరూ కోట్రెల్ ను మరువలేరు. వికెట్ తీసిన ప్రతిసారీ, తనదైన స్టయిల్ లో మిలిటరీ శాల్యూట్ చేసి, సంబరాలు చేసుకునే కోట్రెల్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక, ధోనీ రాష్ట్రపతి నుంచి అవార్డును తీసుకుంటున్న పాత వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసిన కోట్రెల్, పొగడ్తలు కురిపించాడు.

ఈ వీడియో తనకెంతో ఆనందాన్ని కలిగించిందని, అందుకే స్నేహితులు, అభిమానులకు షేర్ చేస్తున్నానని చెప్పాడు. ఆటపై చూపించే ఇష్టాన్ని ప్రేమను దేశంపైనా, తన భార్యపైనా కూడా సమానంగా ధోనీ చూపిస్తాడని కొనియాడాడు. ధోనీ తనకెంతో ఆదర్శనీయుడని అన్నాడు. కాగా, ఈ వీడియో ధోనీకి భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా గౌరవ హోదాను ఇచ్చిన సందర్భంగా తీసినది.

MS Dhoni
Leftinent Colnol
Sheldon Cotterell
  • Error fetching data: Network response was not ok

More Telugu News