Andhra Pradesh: పవన్ కల్యాణ్ సినిమాల్లోనే పవర్ స్టార్.. రియల్ లైఫ్ లో కాదు!: టీడీపీ నేత బుద్ధా వెంకన్న

  • జనసేన పార్టీ క్లిక్ అవదు
  • ఆ పార్టీ మద్దతు లేకుండానే ఎంపీటీసీ, జెడ్పీటీసీ గెలిచాం
  • యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో టీడీపీ నేత

ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ క్లిక్ అవదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కానీ ప్రజల మనసులు గెలుచుకోవడంలో ప్రజారాజ్యం విఫలమయిందని చెప్పారు.

పవన్ కల్యాణ్, బీజేపీ మద్దతు లేకుండానే తాము సర్పంచ్ లు, జెడ్పీటీసీలు గెలిచామన్నారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో పవన్ స్టార్ అనీ, రియల్ లైఫ్ లో కాదని స్పష్టం చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. తాను రోజూ మధ్యాహ్నం నిద్రపోతాననీ, రెండు గంటల పాటు రెస్ట్ తీసుకుంటానని చెప్పారు. 

Andhra Pradesh
Telugudesam
Pawan Kalyan
Jana Sena
budda venkanna
budha venkanna
  • Loading...

More Telugu News