Amaravati: అమరావతి పరిధిలో పలు నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు!

  • సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులోకి
  • ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిషేధం
  • రేపు అసెంబ్లీ ముట్టడికి ఎంఆర్పీఎస్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లా పెదకాకాని నుంచి సీతానగరం వరకూ విస్తరించిన అమరావతి ప్రాంతంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలవుతుందని గుంటూరు అర్బన్ ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా అనుమతి లేకుండా ఏ సంస్థా, వ్యక్తులు సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు చేయడం నిషేధమని అన్నారు.

 కాగా, ఎస్సీల వర్గీకరణను కోరుతూ మంగళవారం నాడు ఆసెంబ్లీ ముట్టడికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ను తెరపైకి తీసుకు వచ్చినట్టు తెలుస్తోంది.

Amaravati
Section 30 Police Act
MRPS
  • Loading...

More Telugu News