Singareni: ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిపోయిన బొగ్గు వెలికితీత!
- పలు జిల్లాల్లో భారీ వర్షాలు
- గనుల్లోకి చేరిన వరద నీరు
- నిలిచిన బొగ్గు ఉత్పత్తి
నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీగా నీరు చేరడంతో సింగరేణి గనులతో పాటు శ్రీరామ్ పూర్ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షాలతో సింగరేణిలో 9 టన్నులు, శ్రీరామ్ పూర్ లో 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తిని ఆపి వేసినట్టు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల తదితర జిల్లాల్లో గడచిన 48 గంటలుగా వర్షాలు కురుస్తూనే ఉండటంతో మల్హర్, పలిమెల, మహదేవే పూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ గ్రామల మధ్య ఉన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బొగ్గు ఉత్పత్తి నిలిచిన కారణంగా రోజుకు దాదాపు రూ. 4 కోట్ల మేరకు ఆదాయ నష్టం జరుగుతోందని అధికారులు అంటున్నారు.