IIT Bombay: ఎలా వచ్చిందబ్బా! ఐఐటీ బాంబే క్లాసు రూములోకి ఆవు.. నవ్వులు పూయిస్తున్న నెటిజన్లు!

  • బయటకు పంపేందుకు కష్టపడిన అధ్యాపకులు, విద్యార్థులు
  • వైరల్ అవుతున్న వీడియో
  • క్యాంపస్‌లో గోశాల ఏర్పాటు చేయాలంటున్న నెటిజన్లు

ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబే తరగతి గదిలో విచిత్ర ఘటన ఒకటి చోటుచేసుకుంది. సీరియస్‌గా క్లాసు జరుగుతుండగా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ ఆవు నేరుగా తరగతి గదిలోకి ప్రవేశించింది. దానిని చూసిన విద్యార్థులు ప్రొఫెసర్లు ఆశ్చర్యపోయారు. క్లాస్ రూము నుంచి దానిని బయటకు పంపేందుకు నానాపాట్లు పడ్డారు. ఇప్పుడిందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో క్లిప్‌ను చూసిన నెటిజన్లు నవ్వులు పూయించే కామెంట్లు చేస్తున్నారు. జేఈఈ రాయకుండానే ఆవు లోపలికి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. దానిని చూడగానే విద్యార్థులు గౌరవంగా లేచి నిలబడడం చాలా బాగుందని అంటున్నారు. ఆవులు ఆక్సిజన్‌ను వదులుతాయన్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఐఐటీలో గోశాల ఏర్పాటు చేయడం బెటరని మరికొందరు సలహా ఇస్తున్నారు. కాగా, ఇటీవల ఇదే క్యాంపస్‌లోకి ప్రవేశించిన ఓ ఆవు ఓ విద్యార్థిని కొమ్ములతో కుమ్మేసింది.

IIT Bombay
cow
class room
JEE
  • Loading...

More Telugu News