Mamata banerjee: అధికారం లేకపోతే మమత ఆత్మహత్య చేసుకుంటారు: బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

  • అధికారం కోసం ఏం చేయడానికైనా మమత సిద్ధం
  • బెంగాల్‌ను కశ్మీర్‌లా మారుస్తున్నారు
  • 107 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు రాష్ట్రాన్ని కశ్మీర్‌లా మారుస్తున్నారని ఆరోపించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన మమత.. అధికారాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని అన్నారు. అధికారం కోల్పోతే ఆమె ఆత్మహత్య చేసుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని లిలువాలో జరిగిన బహిరంగ సభలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

మమత తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు రోహింగ్యాలకు, బంగ్లాదేశీయులకు ఆశ్రయం ఇచ్చి వారిని ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని అర్జున్ సింగ్ ఆరోపించారు. విదేశీయుల కారణంగా పశ్చిమ బెంగాల్ మరో కశ్మీర్‌లా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 107 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారన్న ఆయన, మమతకు దమ్ముంటే తన నియోజకవర్గమైన భాట్‌పర నుంచి పోటీ చేయాలని అర్జున్ సింగ్ సవాలు విసిరారు.

Mamata banerjee
TMC
West Bengal
BJP
arjun singh
  • Loading...

More Telugu News