Tamanna simhadri: ‘బిగ్‌బాస్’ నుంచి హేమ అవుట్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హిజ్రా తమన్నా ఇన్!

  • తొలి వారం పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షో
  • ట్రాన్స్‌జెండర్‌ను అయినా తనను ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందన్న తమన్నా
  • సత్తా చాటుతానని ఆశాభావం

వివాదాల నడుమ స్టార్ మా టీవీలో ప్రారంభమైన ‘బిగ్‌బాస్’ రియాలిటీ షో విజయవంతంగా తొలి వారం పూర్తి చేసుకుంది. మొత్తం 15 మంది పోటీదారుల్లో రెండో రోజే ఆరుగురు సభ్యులు రాహుల్, పునర్నవి, వితికా శెరు, హిమజ, జాఫర్, హేమలు ఎలిమినేషన్ రౌండ్‌కు నామినేట్ అయ్యారు. వీరిలో నటి హేమ ఆదివారం షో నుంచి ఎలిమినేట్ అయింది. అయితే, ఆ వెంటనే హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా  తమన్నా సింహాద్రి అనే హిజ్రాను హౌస్‌లోకి పంపి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓ హిజ్రాను హౌస్‌లోకి పంపడం తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇదే తొలిసారి. హిజ్రా లోపలికి వెళ్లడంతో షో మరింత ఆసక్తిగా తయారైంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ అయినా తనకు అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉందంటూ బిగ్‌బాస్‌కు థ్యాంక్స్ చెప్పింది. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, హౌస్‌లో చివరి వరకు ఉంటానని ఆశాభావం వ్యక్తం చేసింది.  

Tamanna simhadri
bigboss
actor hema
star maa
  • Loading...

More Telugu News