Bihar: చెరువులో పడి ఆరుగురు చిన్నారుల మృతి

  • స్నానానికని వెళ్లిన ఏడుగురు చిన్నారులు
  • ఏడుగురిలో ఒక చిన్నారి గల్లంతు
  • గాలింపు చర్యలు చేపట్టిన ఈతగాళ్లు

చెరువులో స్నానానికని దిగిన ఆరుగురు చిన్నారులు మృతి చెందిన ఘటన బీహార్‌లోని ఛాప్రా జిల్లాలో జరిగింది. డొయిల్లా గ్రామానికి చెందిన ఏడుగురు చిన్నారులు స్థానిక చెరువుకు వెళ్లారు. వీరిలో ఆరుగురు మృతి చెందగా, ఒకరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఈతగాళ్ల సాయంతో గల్లంతైన చిన్నారి కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఆరుగురు చిన్నారుల మృతితో డొయిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది.

Bihar
Chapra
Lake
Died
Doilla
  • Loading...

More Telugu News