Notheastern: మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ డోంకుపర్ రాయ్ కన్నుమూత

  • అనారోగ్యంతో బాధపడుతున్న డోంకుపర్
  • గురుగ్రామ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • యూడీపీ అధినేత డోంకుపర్

ఈశాన్య రాష్ట్రం మేఘాలయ అసెంబ్లీ స్పీకర్, మాజీ సీఎం డోంకుపర్ రాయ్ (64) కన్నుమూశారు. గత పది రోజులుగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం నిమిత్తం హరియాణాలోని గురుగ్రామ్ లో ఉన్న మేదాంత ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తుదిశ్వాస విడిచారు. డోంకుపర్ రాయ్ భౌతికకాయాన్ని రేపు మేఘాలయాకు తరలించనున్నారు. డోంకుపర్ రాయ్ మృతిపై రాజకీయ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. కాగా, యునైటెడ్ డెమోక్రాటిక్ పార్టీ (యూడీపీ) అధినేత డోంకుపర్ రాయ్. గతంలో మేఘాలయా ముఖ్యమంత్రిగా ఆయన పని చేశారు. 

Notheastern
state
Meghalaya
speaker
Donkpur
  • Loading...

More Telugu News