Telugudesam: టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి

  • ఎన్నికల్లో టికెట్ ఆశించి నిరాశకు గురైన వీరశివారెడ్డి
  • త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం!
  • జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు వెల్లడించిన మాజీ ఎమ్మెల్యే

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం టికెట్ ఆశించి నిరాశచెందిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. వీరశివారెడ్డి ఎన్నికల సమయంలో చంద్రబాబు తనకు టికెట్ ఇవ్వలేదంటూ అలకబూనారు. అప్పటినుంచే ఆయన వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయి. ఇక, రాజీనామాపై వీరశివారెడ్డి వివరణ ఇస్తూ, జిల్లా అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు తెలిపారు.

Telugudesam
YSRCP
Veera Sivareddy
  • Loading...

More Telugu News