Ramesh kumar: అనర్హత వేటు చట్ట విరుద్ధం.. సుప్రీంను ఆశ్రయిస్తా: రెబల్ ఎమ్మెల్యే

  • 14 మందిపై అనర్హత వేటు
  • 11 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీ(ఎస్) ఎమ్మెల్యేలపై వేటు
  • సుప్రీంను ఆశ్రయిస్తానన్న ఎమ్మెల్యే విశ్వనాథ్

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేలు అనర్హత వేటు పడిన వారిలో ఉన్నారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జేడీ(ఎస్) రెబల్ ఎమ్మెల్యే విశ్వనాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలిపారు. తనపై అనర్హత వేటు వేయడాన్ని చట్ట విరుద్ధంగా భావిస్తున్నానని, అందుకే ఈ విషయమై తాను సుప్రీంను ఆశ్రయిచంనున్నట్టు విశ్వనాథ్ స్పష్టం చేశారు.

Ramesh kumar
Viswanath
Karnataka
Supreme Court
Speaker
  • Loading...

More Telugu News