Kobbarimatta: నా డ్రీమ్ రోల్ లాయర్ క్యారెక్టర్: హాస్యనటుడు సంపూర్ణేశ్ బాబు

  • ‘ఉపేంద్ర’లాంటి సినిమాలో నటించాలని ఉంది
  • ‘హృదయకాలేయం’ను మించిన హాస్యం‘కొబ్బరిమట్ట’  
  • మైఖేల్ జాక్సన్ స్టెప్పులను నాతో వేయించారు

ప్రముఖ హాస్యనటుడు సంపూర్ణేశ్ బాబు తన డ్రీమ్ రోల్ గురించి ప్రస్తావించాడు. సంపూర్ణేశ్ బాబు త్రిపాత్రాభినయం చేసిన ‘కొబ్బరిమట్ట’ చిత్రం వచ్చే నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన డ్రీమ్ రోల్ ‘లాయర్’ క్యారెక్టర్ అని చెప్పాడు. ప్రముఖ దక్షిణాది నటుడు ఉపేంద్ర నటించిన చిత్రం ‘ఉపేంద్ర’ గురించి సంపూ ప్రస్తావించాడు. ‘ఉపేంద్ర’ లాంటి సినిమాలో నటించాలని తనకు ఉందని అన్నాడు.

‘కొబ్బరిమట్ట’ గురించి మాట్లాడుతూ, ‘హృదయకాలేయం’ చిత్రాన్ని మించి ‘కొబ్బరిమట్ట’ హాస్యాన్ని పండిస్తుందని, పాటలు కూడా కడుపుబ్బ నవ్విస్తాయని చెప్పాడు. ఈ చిత్రంలోని ‘శంభో శివ శంభో..’ పాట గురించి ప్రస్తావించాడు. పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ స్టెప్పులను తనతో వేయించారని చెబుతూ నవ్వులు చిందించారు.

  • Loading...

More Telugu News