Andhra Pradesh: పాము చనిపోయాక ఇక కర్రెందుకు?: చంద్రబాబుపై రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఘాటు విమర్శలు

  • చంద్రబాబు సింపతీ కోసం ప్రయత్నించారు
  • ఆయన నిజంగానే జైలుకు వెళ్లబోతున్నారు
  • భీమవరంలో మీడియాతో బీజేపీ నేత

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ నేత, నటుడు కృష్ణంరాజు విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు రెండు వారాల ముందు ‘నన్ను కేంద్రం జైలులో పెడుతుందేమో’ అని చంద్రబాబు అన్నారని కృష్ణంరాజు అన్నారు. అప్పుడు చంద్రబాబు సింపతి కోసం అలా చెప్పినా, ఇప్పుడు అది నిజం కాబోతోందని అన్నారు. తప్పు చేసినవాళ్లు జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు.

‘చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. పాము చచ్చిపోయాక ఇక కర్ర ఎందుకు’ అని  చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో ఈరోజు జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడగకపోతే అమ్మయినా అన్నం పెట్టదనీ, కేంద్రం అమ్మకాకపోయినా గత ప్రభుత్వం సఖ్యతతో ఉండే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలకు న్యాయం జరగాలన్నదే తన ఆకాంక్ష అని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Telugudesam
Chandrababu
krishnam raju
BJP
  • Loading...

More Telugu News