Telangana: జైపాల్ రెడ్డికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్

  • జైపాల్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించిన కేసీఆర్
  • ఆయన కుటుంబసభ్యులకు ఓదార్పు
  • నివాళులర్పించిన పలువురు మంత్రులు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డికి సీఎం కేసీఆర్ నివాళులర్పిచారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో జైపాల్ రెడ్డి భౌతికకాయాన్ని ఆయన సందర్శించి, పుష్పగుచ్ఛం ఉంచారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. కేసీఆర్ వెంట టీఆర్ఎస్ నేతలు కే.కేశవరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, సంతోష్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. జైపాల్ రెడ్డి భౌతికకాయానికి వారు కూడా నివాళులు అర్పించారు.

Telangana
cm
kcr
congress
jaipalreddy
  • Loading...

More Telugu News