Karnataka: జైపాల్ రెడ్డి మృతికి కంటతడి పెట్టిన కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్

  • అనారోగ్యంతో కన్నుమూసిన జైపాల్ రెడ్డి
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన కర్ణాటక స్పీకర్ రమేశ్ కుమార్
  • జైపాల్ రెడ్డి మరణం తనను కలచివేసిందంటూ వ్యాఖ్య

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజకీయ దిగ్గజం ఎస్.జైపాల్ రెడ్డి అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. పార్టీలకు అతీతంగా ఆయన మరణం పట్ల నేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జైపాల్ రెడ్డి మృతి పట్ల కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తన అనుబంధాన్ని స్మరించుకుని భావోద్వేగాలకు లోనైన రమేశ్ కుమార్ కంటతడి పెట్టారు. జైపాల్ రెడ్డి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు తీరనిలోటు అని, ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాని పేర్కొన్నారు. 

Karnataka
Speaker
Ramesh Kumar
  • Loading...

More Telugu News