Karnataka: స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యానికి నిజమైన విజయం: కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య

  • రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై స్పందన
  • ఈ నిర్ణయం అవకాశవాద రాజకీయాలకు గొడ్డలిపెట్టు  
  • చట్టసభల్లో పాటించే సంప్రదాయాలే భావి తరాలకు ఆదర్శం 

కర్ణాటకలోని రెబెల్ ఎమ్మెల్యేలు పద్నాలుగు మందిపై అనర్హత వేటు వేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి నిజమైన విజయంగా అభివర్ణించారు. ఈ నిర్ణయం అవకాశవాద రాజకీయాలకు గొడ్డలిపెట్టు లాంటిదని అన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయని, అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని, చట్టసభల్లో పాటించే సంప్రదాయాలే భావి తరాలకు ఆదర్శమని అన్నారు.

Karnataka
speaker
congress
siddharamaiah
  • Loading...

More Telugu News