Andhra Pradesh: విజయవాడలో కారు బీభత్సం.. ప్రాణాలు కోల్పోయిన బాలుడు!

  • నగరంలోని అయోధ్యనగర్ వద్ద ఘటన
  • రెండు ఆటోలను ఢీకొట్టిన కారు
  • సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. నగరంలోని అయోధ్యనగర్ కరకట్ట వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతూ  రెండు ఆటోలను, ఓ బాలుడిని ఢీకొట్టింది. అయినా ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో సదరు బాలుడు ప్రాణాలు కోల్పోగా, రెండు ఆటోల్లోని ప్రయాణికులు గాయపడ్డారు. అయితే ఈ కారు ఎవరిది, ఎవరు నడుపుతున్నారు? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన నగర పోలీసులు కారు వివరాల కోసం సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Andhra Pradesh
Vijayawada
Road Accident
car accident
Police
  • Loading...

More Telugu News