justice ramana: న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సత్సంబంధాలు ఉండాలి : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రమణ

  • అప్పుడే కక్షిదారులకు న్యాయం జరుగుతుంది
  • న్యాయం లభిస్తుందన్న భరోసా కోర్టు వాతావరణంలో ఉండాలి
  • సికింద్రాబాద్‌లో సిటీ సివిల్‌ కోర్టు భవనాలను ప్రారంభించిన జస్టిస్

తమకు కోర్టులో న్యాయం జరుగుతుందన్న ఎంతో ఆశతో కక్షిదారులు వస్తారని, ఆ భరోసా వారిలో కలిగేలా న్యాయ స్థానాల్లో వాతావరణం ఉండడం తప్పనిసరని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అభిప్రాయపడ్డారు. ఈరోజు సికింద్రాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్డు భవనాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగే సభలో మాట్లాడుతూ కోర్టులో మంచి వాతావరణం కొనసాగాలంటే న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సత్సంబంధాలు ఉండాలని, అప్పుడే విచారణ సులభతరం అవుతుందని సూచించారు. కక్షిదారులకు వీలైనంత వేగంగా న్యాయం జరిపించేందుకు ఇరువర్గాలు కృషి చేయాలన్నారు. అప్పుడే న్యాయం జరుగుతుందన్న కొండంత ఆశతో వచ్చిన కక్షిదారులకు భరోసా కలుగుతుందని చెప్పారు.

justice ramana
Supreme Court
secundrabad
city civil court
  • Loading...

More Telugu News