BJP: 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై వేటు... యడియూరప్ప విశ్వాస పరీక్షకు గంటల ముందు కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం!

  • 11 మంది కాంగ్రెస్ ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలపై వేటు
  • మీడియాకు వెల్లడించిన రమేశ్ కుమార్
  • రాజీనామాలు ఆమోదించకుండా వేటు ఏంటంటున్న బీజేపీ

రేపు కర్ణాటక అసెంబ్లీలో సీఎం యడియూరప్ప విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న సమయంలో స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 14 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితం ఆయన ప్రకటించారు. వీరిలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుకాగా, మిగతా వారు జేడీఎస్ ఎమ్మెల్యేలు. దీంతో కన్నడ అసెంబ్లీ నుంచి మొత్తం 17 మందిని డిస్ క్వాలిఫై చేసినట్టు అయింది. గతవారంలో రమేశ్ కుమార్ ముగ్గురిపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇక వీరెవరూ నాలుగేళ్ల పాటు ఎటువంటి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుండదు.

ఎమ్మెల్యేల డిస్ క్వాలిఫికేషన్ ను స్వయంగా మీడియా ముందు ప్రకటించిన రమేశ్ కుమార్, స్పీకర్ గా తాను రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. కాగా, స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాలు చేసిన ప్రజా ప్రతినిధుల రాజీనామాలను ఆమోదించకుండా, వారు తప్పు చేసినట్టు డిస్ క్వాలిఫై చేయడం ఏంటని పలువురు బీజేపీ నేతలు తప్పుబడుతుతున్నారు. కాగా, డిస్ క్వాలిఫై అయిన వారిలో కాంగ్రెస్ నుంచి బస్వరాజు, మునిరత్నం, సోమశేఖర్, సుధాకర్, శివరాం హెబ్బర్, శ్రీమంత పాటిల్, జేడీఎస్ నుంచి గోపాలయ్య, నారాయణ గౌడ, విశ్వనాథ్ తదితరులున్నారు. 

  • Loading...

More Telugu News