Ravisekhar: నా కుమారుడిని చంపేయండి: సోనీ కిడ్నాపర్ రవిశేఖర్ తల్లి!

  • ఐదు రోజుల క్రితం సోనీ కిడ్నాప్
  • రవిశేఖర్ కుమారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • కొడుకు చేసిన పనితో తల తీసేసినట్లయిందన్న తల్లి

ఐదు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సోనీ అనే యువతిని కిడ్నాప్ చేసి, పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న రవిశేఖర్ నిజస్వరూపం తెలుసుకున్న తల్లి చిట్టెమ్మ, తన కొడుకు దొంగతనాలు చేస్తున్నాడని తెలుసుగానీ, ఇంత ఘోరమైన పనులు చేస్తున్నాడన్న సంగతి తనకు తెలియదని, కన్నీటి పర్యంతమయ్యారు. అతన్ని పోలీసులు చంపేయాలని కోరిన చిట్టెమ్మ, తన మనవడు ఏ తప్పూ చేయలేదని, పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని, మనవడిని మాత్రం వదిలి పెట్టాలని వాపోయింది.

కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని దావులూరు రవిశేఖర్ స్వగ్రామం కాగా, ఏడేళ్ల క్రితమే తన కొడుకు వెళ్లిపోయాడని, అప్పటి నుంచి తిరిగి తమ వద్దకు రాలేదని చెప్పిన చిట్టెమ్మ, ఆడపిల్లల జీవితాలతో వాడు ఆడుకుంటున్న విషయం టీవీల్లో చూసే తెలుసుకున్నామని, వాడిని వదిలి పెట్టొద్దని పోలీసులను కోరింది. గ్రామంలో పెద్ద మనిషిగా ఉన్న తనకు సోదరుడు చేసిన పనితో తల కొట్టేసినట్లయిందని రవిశేఖర్ సోదరుడు వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. అతను ఉన్నా, పోయినా తమకు ఒక్కటేనని అన్నాడు. రవిశేఖర్ కు అతని కుమారుడు రాజుకు సంబంధాలు లేవని, రాజును అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నాడు.

Ravisekhar
Sony
Kidnap
Krishna District
Davuluru
  • Loading...

More Telugu News