Andhra Pradesh: విజయవాడలో నా పేరు మీదున్న రికార్డు మరే టీడీపీ నేతకూ లేదు!: బుద్ధా వెంకన్న

  • మూడు సార్లు నగర పార్టీ అధ్యక్షుడిగా పనిచేశా
  • విజయవాడలో యాంటీ టీడీపీ వేవ్ ఉండేది
  • కానీ 39 మంది కార్పొరేటర్లను గెలిపించుకున్నాం

విజయవాడ టీడీపీ నగర అధ్యక్షుడిగా తాను మూడు సార్లు పనిచేశానని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. తనకు తెలిసినంతవరకూ మరే నేత ఇన్నిసార్లు బాధ్యతలు నిర్వర్తించలేదని చెప్పారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లగలనని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ తనను నమ్మారని వ్యాఖ్యానించారు. అలాగే తన హయాంలోనే విజయవాడ కార్పొరేషన్ లో 39 మంది టీడీపీ కార్పొరేటర్లు గెలుపొందారనీ, ఇలా ఎప్పుడూ జరగలేదని అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుద్ధా వెంకన్న మాట్లాడారు.

‘టీడీపీ ఏపీలో ఐదు సార్లు అధికారంలోకి వచ్చినా విజయవాడ నగరంలో మాత్రం 2014లోనే అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే విజయవాడలో యాంటీ తెలుగుదేశం గాలి ఉంటుంది. కానీ నేను అధ్యక్షుడిని అయ్యాక పరిస్థితి మారింది. ఈరోజు టీడీపీకి విజయవాడ కంచుకోటగా మారింది. ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే వెళ్లి అక్కడ నిలబడతా.

అందుకే చంద్రబాబు గారు, లోకేశ్ గారు మూడోసారి నగర అధ్యక్షుడి పదవిని నాకు అప్పగించారు. విజయవాడ చరిత్రలోనే మూడు సార్లు అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా ఎవ్వరూ పనిచేయలేదు. నేను జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలందరి కంటే చిన్నవాడిని. ఇది చంద్రబాబు నాయుడుగారు నాకు ఇచ్చిన గిఫ్ట్’ అని తెలిపారు. చంద్రబాబు తనకు నోట్ల కట్టలు చూసి బాధ్యతలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

Andhra Pradesh
Vijayawada
Telugudesam
budda venkanna
mlc
  • Loading...

More Telugu News