Andhra Pradesh: నాకు వార్నింగ్ ఇచ్చేంత సీన్ ఆ వైసీపీ నేతకు లేదు!: టీడీపీ నేత బుద్ధా వెంకన్న

  • ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నవి వదంతులే
  • మేమిద్దరం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లుగా పనిచేశాం
  • చంద్రబాబు గారిపై అబద్ధాలు ప్రచారం చేస్తే తిప్పికొడతా

వైసీపీ మీడియా కోఆర్డినేటర్ తలశిల రఘురాం తనకు వార్నింగ్ ఇచ్చినట్లు వస్తున్న వార్తలను టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఖండించారు. తనకు వార్నింగ్ ఇచ్చేంత సీన్ రఘురాంకు లేదని వెంకన్న తెలిపారు. దమ్ముంటే విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టు అంటూ అతను చెప్పినట్లు వస్తున్న వార్తలు వదంతులేనని స్పష్టం చేశారు.

ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే తలశిల రఘురాంకు నేరుగా ఫోన్ చేసి కనుక్కోవాలని సూచించారు. తామిద్దరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశామని బుద్ధా వెంకన్న గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు గారిపై ఎవరైనా అబద్ధపు ప్రచారం చేస్తే తిప్పికొట్టాల్సిన బాధ్యత తనపై ఉంటుందని చెప్పారు.

Andhra Pradesh
Telugudesam
YSRCP
talasila raghuram
budda venkanna
youtube
  • Loading...

More Telugu News