Telangana: ట్విట్టర్ రారాజు జీహెచ్ఎంసీ.. దేశంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న కార్పొరేషన్ గా రికార్డు!

  • జీహెచ్ఎంసీకి లక్షకు పైగా ఫాలోవర్లు
  • ఫిర్యాదులపై సత్వరం స్పందిస్తున్న సిబ్బంది
  • ప్రత్యేక చొరవ తీసుకుంటున్న కమిషనర్ దానకిశోర్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) చరిత్ర సృష్టించింది. తాజాగా ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న కార్పొరేషన్ గా రికార్డు నెలకొల్పింది. ప్రస్తుతం  అహ్మదాబాద్ కార్పొరేషన్ ట్విట్టర్ పేజీకి 40,100 మంది, బెంగళూరు కార్పొరేషన్ కు 26,800 మంది ఫాలోవర్లు ఉండగా, జీహెచ్ఎంసీ ఫాలోవర్ల సంఖ్య లక్షను దాటేసింది. అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్ ట్విట్టర్ ఖాతాను కూడా 55,400 మంది ఫాలో అవుతున్నారు.

ఇక మేయర్ బొంతు రామ్మోహన్ 44,600 మంది, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ను 15,800 మంది ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు. ట్విట్టర్ వేదికగా చేస్తున్న ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కారం అవుతుండటంతోనే ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. సోషల్ మీడియా ద్వారా అందుతున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు కమిషనర్ దానకిషోర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని చెబుతున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News