Sony: నల్లమల ఫారెస్ట్ లో సోనీ కిడ్నాపర్... జల్లెడ పడుతున్న రెండు రాష్ట్రాల పోలీసులు!

  • ఐదు రోజుల క్రితం కిడ్నాప్
  • తండ్రి, సోదరుడిని మభ్యపెట్టి అమ్మాయిని ఎత్తుకెళ్లిన రవిశేఖర్
  • కిడ్నాప్ వెనుక బంధువుల హస్తం

హైదరాబాద్ లో ఫార్మసీ చదువుతున్న విద్యార్థిని సోనీ ప్రస్తుతం నల్లమల అడవుల్లోని ఓ ప్రాంతంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమెను కిడ్నాప్ చేసిన రవిశేఖర్ ఆనవాళ్లు ఫారెస్ట్ ఏరియాలో లభ్యంకాగా, ఏపీ పోలీసుల సహకారంతో తెలంగాణ పోలీసులు అడవుల్లో గాలిస్తున్నారు. ఇప్పటికే కిడ్నాప్ వ్యవహారంలో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు, కిడ్నాప్ వెనుక బంధువుల హస్తమున్నట్టు గుర్తించారని సమాచారం.

హయత్ నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తిని మభ్యపెట్టిన రవిశేఖర్, అతని కుమార్తె సోనీకి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి, అందరినీ కారులో ఎక్కించుకుని, హైదరాబాద్ లో చక్కర్లు కొట్టి, రాత్రి 8 గంటల సమయంలో జిరాక్స్ లు తీసుకురావాలని తండ్రికి చెప్పి, సోనీని అపహరించుకుపోయిన సంగతి తెలిసిందే. ఆమెను కర్నూలు వైపు తీసుకెళ్లినట్టు పలు సీసీటీవీ కెమెరాలు స్పష్టం చేయగా, ఇప్పటికే రవిశేఖర్ కుమారుడు రాజాను అతడి అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.

Sony
Hyderabad
Ravishekar
Kidnap
Police
Nallamala
Forest
Search
  • Loading...

More Telugu News