Rahul bose: రెండు అరటి పండ్లు రూ.442.50కి అమ్మిన హోటల్‌కు రూ.25 వేల జరిమానా

  • చండీగఢ్ హోటల్ మాయాజాలం 
  • తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న నటుడు రాహుల్ బోస్ 
  • విచారణ చేపట్టి జరిమానా విధించిన ప్రభుత్వం

బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్‌కు రెండు అరటి పండ్లు రూ.442.50కి అమ్మిన చండీగఢ్‌లోని ఫైవ్ స్టార్ హోటల్‌పై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. జీఎస్టీ నిబంధనలు అతిక్రమించి పండ్లను అతిక్రమించిన నేరానికి రూ.25 వేల జరిమానా విధించింది. షూటింగ్ పనిపై ఈ నెల 22న చండీగఢ్ వెళ్లిన నటుడు రాహుల్ బోస్ అక్కడ ఓ ‌ఫైవ్‌స్టార్ హోటల్‌‌లో బస చేశాడు. ఉదయం వర్కవుట్ తర్వాత రెండు అరటి పండ్లు ఆర్డర్ చేశాడు. హోటల్ సిబ్బంది అరటి పండ్లతోపాటు రూ.442.50 బిల్లును చేతిలో పెట్టడంతో రాహుల్ నిర్ఘాంతపోయాడు. వెంటనే ఆ బిల్లును, అరటి పండ్లను ఫొటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. అరటి పండ్లు కూడా ఆరోగ్యానికి హానికరమేనని ఆవేదన వ్యక్తం చేశాడు.

అరటి పండ్ల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన చండీగఢ్ వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్ మణిదీప్ భర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అధికారులు, హోటల్ యాజమాన్యం నిబంధనలు అతిక్రమించినట్టు నిర్ధారించారు. సీజీఎస్టీలోని సెక్షన్ 11 నిబంధనలు అతిక్రమించి పండ్లను విక్రయించారని తేల్చారు. దీంతో ఆ హోటల్‌కు రూ.25 వేల జరిమానా విధించారు.

Rahul bose
Bollywood
Actor
Banana
chandigarh
  • Loading...

More Telugu News