Venkaiah Naidu: పార్లమెంటులోనూ మహిళలకు రిజర్వేషన్ ఉండాలి: ఉపరాష్ట్రపతి

  • దేశాన్ని ‘మదర్ ఇండియా’ అని వ్యాఖ్యానిస్తాం
  • ఫాదర్ ఇండియా అని వ్యాఖ్యానించం
  • మహిళలకు బాధ్యతలు అప్పగించాలి

దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు పార్లమెంటులోనూ రిజర్వేషన్ ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నేడు ఆయన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మహిళల ప్రాముఖ్యాన్ని గురించి మాట్లాడారు. మన దేశం గురించి మాట్లాడేటప్పుడు మదర్ ఇండియా అని సంబోధిస్తామే తప్ప ఫాదర్ ఇండియా అని పిలవమని, అది మహిళలకిచ్చే ప్రాధాన్యమన్నారు. మహిళలకు రిజర్వేషన్‌తో పాటు నిధులు, విధులు, బాధ్యతలు అప్పగించాలన్నారు.

Venkaiah Naidu
Parliament
Women
Mother India
Reservations
  • Loading...

More Telugu News