Tirumala: నిరుపేదల కోసం మోదీ మరికొన్ని పథకాలను ప్రవేశపెట్టనున్నారు: కేంద్ర మంత్రి దేవశ్రీ చౌదరి

  • మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
  • మహిళల సంక్షేమానికి కేంద్రం ఎన్నో పథకాలు తెచ్చింది 
  • ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు

నిరుపేదల కోసం ప్రధాని నరేంద్రమోదీ మరికొన్ని పథకాలను త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి దేవశ్రీ చౌదరి వెల్లడించారు. నేడు ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. మహిళల సంక్షేమం కోసం కేంద్రం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. దేశ ప్రజలు పూర్తి స్థాయిలో మోదీ ప్రవేశ పెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు.

Tirumala
Devasri Chowdary
Narendra Modi
Projects
Women welfare
  • Loading...

More Telugu News