Avinash Mukharji: అలా మొదలైన ప్రయాణం మా ప్రేమకు దారి తీసింది: ‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేం జగదీశ్

  • కంపెనీకి కంటెంట్ రైటర్ కావాలని మెసేజ్ పెట్టా
  • బాగా రాస్తుందని తెలిసే రిక్రూట్ చేసుకోవాలనుకున్నా
  • తను మాత్రం వేరే వాళ్లను రికమండ్ చేసింది

‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేం అవినాశ్ ముఖర్జీ(జగదీశ్) ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. అంతేకాదు అవినాశ్ తన కాలేజ్‌మేట్‌ ప్రేమలో మునిగి తేలుతున్నాడు. ఈ విషయాన్ని అవినాశ్ స్వయంగా ఓ వెబ్‌సైట్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తన ప్రేయసి తన కాలేజ్‌మేటేనని, తమ కంపెనీకి కంటెంట్ రైటర్ కావాలంటూ ఓ రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశానన్నాడు. తను బాగా రాస్తుందని తెలిసే రిక్రూట్ చేసుకోవాలనుకున్నానని, కానీ తను మాత్రం వేరే వాళ్లను రికమండ్ చేసిందని తెలిపాడు.

కానీ తాను మొండిగా తనే కావాలని పదే పదే అడిగానని, చివరకు అంగీకరించిందన్నాడు. అలా మొదలైన తమ ప్రయాణం ప్రేమకు దారి తీసిందని, తన తల్లికి కూడా ప్రేయసిని పరిచయం చేశానని, ఇప్పుడు వాళ్లిద్దరూ స్నేహితులయ్యారని తెలిపాడు. ఈ నేపథ్యంలోనే ఓ రోజు ఉదయం 4 గంటలకు ప్రపోజ్ చేశానని, అది బ్రహ్మ ముహూర్తమని తెలిపాడు. ఆ సమయంలోనే బ్రహ్మ నిద్ర లేస్తాడని ఆయన తమ బంధాన్ని దృఢముగా  
ఉంచుతాడని అవినాశ్ సరదాగా తెలిపాడు.

Avinash Mukharji
Jagadish
Chinnari Pelli Kuturu
Website
Instagram
  • Loading...

More Telugu News