Malkajgiri: రేవంత్‌కి తన పదవేంటో.. పొజిషన్ ఏంటో ఆయనకే తెలియదు: పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఎద్దేవా

  • రేవంత్ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు
  • అత్యంత శక్తిమంతమైన ప్రధానిగా మోదీ ఎదిగారు
  • కుంతియా లీలలు అమోఘం
  • అసెంబ్లీ టికెట్‌ను రూ.కోటికి అమ్ముకున్నారు

మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి తన పదవేంటో, పొజిషన్ ఏంటో ఆయనకే తెలియదని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నేడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, భవిష్యత్ ఏంటో తెలియక కాంగ్రెస్ నేతలకు ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదని, ఆ కారణంగానే రేవంత్ కూడా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒకటేనన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను తోసిపుచ్చిన సుధాకర్‌రెడ్డి, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ప్రధానిగా మోదీ ఎదిగారన్నారు.

టీకాంగ్రెస్ నేత కుంతియా లీలలు అమోఘమని, ఆయనే టీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారన్నారు. కుంతియా అసెంబ్లీ టికెట్‌ను కోటి రూపాయల చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియన్ నేషనల్ క్యాస్ట్, కమర్షియల్, కరప్షన్ కాంగ్రెస్ అని కొత్త అర్థాన్ని చెప్పారు. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలు పరచకపోవడానికి కారణం ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందనేనని పొంగులేటి వ్యాఖ్యానించారు.

Malkajgiri
Revanth Reddy
Ponguleti Sudhakar Reddy
Narendra Modi
Congress
Kunthiya
  • Loading...

More Telugu News