Karnataka: న్యూమరాలజిస్టుల సలహా: యడియూరప్పగా పేరు మార్చుకున్న కర్ణాటక సీఎం యడ్యూరప్ప

  • 2007కు ముందు YEDIURAPPA
  • న్యూమరాలజిస్టుల సూచనలతో మళ్లీ అదే అక్షరక్రమం 
  • అదృష్టం కలిసొస్తుందన్న నమ్మకంతోనే ఇలా చేశారట!

కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప, 2007కు ముందు తన పేరు (YEDIYURAPPA)లో ఏ అక్షరాలు అయితే ఉండేవో మళ్లీ అదే పద్ధతిలోకి ఆయన పేరును మార్చుకున్నారు. అప్పట్లో అదృష్టం కలిసి రావడం లేదనే కారణంతో ఆయన తన పేరును యడ్యూరప్ప (YEDDYURAPPA)గా మార్చుకున్నారు. అప్పటి నుంచి అదే పేరుతో కొనసాగుతున్న ఆయన, ఇప్పుడు తన పేరును మళ్లీ పాత పద్ధతిలోకి మార్చుకోవడం గమనార్హం.

కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఈ నెల 23న రాసిన లేఖల ద్వారా ఈ విషయం స్పష్టమవుతోంది. కొందరు న్యూమరాలజిస్టుల సూచనల మేరకే ఆయన మళ్లీ తన పేరును యడియూరప్ప ( ‘YEDIYURAPPA ’) గా మార్చుకున్నారని సమచారం. ఇప్పటి వరకూ మూడు పర్యాయాలు కర్ణాటక సీఎంగా పని చేసిన యడియూరప్ప ఇంత వరకూ పూర్తి కాలం పదవీలో కొనసాగలేదు.

తన పేరులోని ఇంగ్లీషు అక్షరాల్లో మార్పులు కనుక చేస్తే ఈసారైనా పూర్తి పదవీ కాలం కొనసాగుతారన్న నమ్మకం యడియూరప్పకు న్యూమరాలజిస్టుల సూచనలతో కల్గిందని సమాచారం.

Karnataka
cm
yediurappa
jds
amithsha
  • Loading...

More Telugu News