Andhra Pradesh: మంత్రి ఆదిమూలపు సురేశ్ పై వర్ల రామయ్య మండిపాటు!

  • సీఎం జగన్, మంత్రి సురేశ్ ను ఉద్దేశించి ట్వీట్
  • దళిత కులాల్లో సమన్యాయం కోసం బాబు పాటుపడ్డారు
  • అవగాహన లేకుండా సురేశ్ మాట్లాడుతున్నారు

బడుగు, బలహీన వర్గాల కోసం మాజీ సీఎం చంద్రబాబునాయుడు పాటుపడలేదని వైసీపీ నేత, ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విమర్శలు చేయడంపై టీడీపీ నేత వర్ల రామయ్య ఘాటుగా ప్రతి స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్, మంత్రి ఆదిమూలపు సురేశ్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. దళిత కులాల్లో సమన్యాయం కోసం ‘వర్గీకరణ’ చేసిన ఘనాపాఠి చంద్రబాబు అని కొనియాడారు. అవగాహన లేకుండా సురేశ్ మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా ‘వర్గీకరణ’ అంశంపై శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని, ఈ అంశానికి సహకరించాలని కోరారు.

Andhra Pradesh
cm
jagan
Telugudesam
varla ramaiah
  • Loading...

More Telugu News