Andhra Pradesh: చంద్రబాబు రాష్ట్రానికి మంచి చేయలేదు.. మేం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు!: విజయసాయిరెడ్డి

  • అసెంబ్లీలో చారిత్రాత్మక బిల్లులు పెట్టాం
  • అప్పుడే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు
  • జగన్ ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం  తనకు ఆశ్చర్యం కలిగించడం లేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజల భవిష్యత్తుకు ఎంతో కీలకమైన బిల్లులు ఆమోదం పొందుతున్నప్పుడు టీడీపీ సభ్యులు ఆందోళన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు తన హయాంలో ఏపీకి ఒక్క మంచి పని కూడా చేయలేదనీ, ఇప్పుడు సీఎం జగన్ రాష్ట్రం కోసం కష్టపడి పనిచేస్తుంటే తట్టుకోలేకపోతున్నారని  విమర్శించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. టీడీపీ హయాంలో దాణా కుంభకోణం కంటే భారీగా అవినీతి జరిగిందని ఇటీవల విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
ASSEMBLY BILLS
Vijay Sai Reddy
YSRCP
Twitter
assembly
Key bills
  • Error fetching data: Network response was not ok

More Telugu News