USA: 24 మంది మహిళలపై లైంగికదాడి.. కేసుల నుంచి తప్పించుకునేందుకు చనిపోయినట్లు డ్రామా!

  • స్కాట్ లాండ్ కు చెందిన గోర్డన్ తెలివితేటలు
  • నేరాల నుంచి తప్పించుకునేందుకు మాస్టర్ ప్లాన్
  • సముద్రంలో మునిగిపోయినట్లు నాటకం.. అరెస్ట్ చేసిన పోలీసులు

నేరస్తులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చివరికి పోలీసులకు దొరికిపోతుంటారు. పోలీసులకు ఉండే విస్తృతమైన నెట్ వర్క్, పరిశోధనా పద్ధతుల కారణంగా చాలామంది  నేరస్తులు అరెస్ట్ అవుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. యూకేలోని స్కాట్ లాండ్ కు చెందిన కిమ్ గోర్డన్(55) మామూలు నేరస్తుడు కాదు. అతనిపై 24 మంది మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్లు కేసులు ఉన్నాయి. అయితే ఈ కేసుల్లో తీర్పు వస్తే తనకు యావజ్జీవం పడటం ఖాయమని భావించిన గోర్డన్ వీటి నుంచి తప్పించుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమారుడి(17)తో కలిసి అమెరికాలోని కాలిఫోర్నియాకు వచ్చాడు.

అక్కడే కార్మెల్ అనే ప్రాంతం దగ్గరున్న మోనాస్టరీ బీచ్ లో రాత్రిపూట ఈత కొడుతూ తాను మాయమవుతాననీ, తాను మునిగిపోయినట్లు పోలీసులకు చెప్పాలని కుమారుడికి సూచించాడు. దీంతో కుమారుడు అలాగే చేశాడు. అయితే గోర్డన్ మాజీ భార్య, కుమారుడి మాటలపై అనుమానం రావడంతో పోలీసులు స్కాట్ ల్యాండ్, ఇంటర్ పోల్, యూఎస్ మార్షల్స్ తో కలిసి పనిచేశారు. చివరికి గోర్డన్ ను కొలరెడో బీచ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతనిపై 24 లైంగిక వేధింపుల కేసులు ఉండటం చూసి అధికారులు విస్తుపోయారు. గోర్డన్ ను ఈ నెలలో స్వదేశం స్కాట్ లాండ్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అతని కుమారుడు మైనర్ అయినందున అబద్ధం చెప్పినప్పటికీ ఎలాంటి శిక్ష వేయకుండా వదిలివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News