Andhra Pradesh: పొదుపు మహిళల రుణాలు రూ.27,000 కోట్లు.. మొత్తం నాలుగు విడతల్లో మాఫీ చేస్తాం!: ఏపీ మంత్రి బుగ్గన

  • ప్రజా సంక్షేమం లక్ష్యంగా ముందుకెళుతున్నాం
  • పార్టీలకు అతీతంగా నవరత్నాలు అమలుచేస్తాం
  • కర్నూలులో మీడియాతో ఏపీ ఆర్థిక మంత్రి

ప్రజా సంక్షేమం లక్ష్యంగానే వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకెళుతోందని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. నవరత్నాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తామని ప్రకటించారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు మహిళలను తీవ్రంగా మోసం చేశారని విమర్శించారు.

కర్నూలు జిల్లాలో ఈ రోజు పర్యటించిన మంత్రి 8 అగ్నిమాపక వాహనాలను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పొదుపు మహిళలకు సంబంధించి రూ.27,000 కోట్ల రుణాలను వచ్చే ఏడాది నుంచి నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని బుగ్గన తెలిపారు. ప్రతీఏటా పొదుపు సంఘాల్లోని మహిళలకు రుణాలు అందజేస్తామని చెప్పారు. పొదుపు రుణాలపై వడ్డీ రూ.1140 కోట్లు అయిందనీ, ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని బుగ్గన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News