great britan: బస్సు డ్రైవర్‌ కొడుకు బ్రిటన్‌లో ఇప్పుడు ఆర్థిక మంత్రి.. ఓ పాకిస్థానీ ప్రస్థానం

  • అద్భుత ప్రస్థానం సొంతం చేసుకున్న సాజిద్‌ జావిద్‌
  • దశాబ్దాల నాడు పొట్టకూటి కోసం వలస పోయిన కుటుంబం
  • తొలుత దుకాణం నడిపి, తర్వాత డ్రైవర్‌గా మారిన సాజిద్‌ తండ్రి

జీవనోపాధి వెతుక్కుంటూ దశాబ్దాల క్రితం బ్రిటన్‌ వలస వెళ్లిన ఓ పాకిస్థానీ కుటుంబం వారసుడు అక్కడి నూతన ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా నియమితులై అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు. అయితే సాజిద్‌ మంత్రి కావడం ఇది మూడోసారి. ఆర్థిక మంత్రిగా తొలిసారి నియమితులయ్యారు. సాజిద్‌ తండ్రి సాధారణ బస్సు డ్రైవర్‌.

వివరాల్లోకి వెళితే...సాజిద్‌ పుట్టక ముందే ఆ కుటుంబం బ్రిటన్‌కు వలసవెళ్లింది. తొలుత సాజిద్‌ తండ్రి చిన్నచిన్న దుకాణాలు నడిపేవాడు. ఆ తర్వాత బస్సు డ్రైవర్‌గా మారాడు. బ్రిటన్‌లో పుట్టిన సాజిద్‌ ఆర్థిక శాస్త్రం, రాజకీయాల్లో డిగ్రీ పూర్తిచేసి పలు బ్యాంకుల్లో పనిచేశాడు. దాదాపు 18 ఏళ్లపాటు బ్యాంకుల్లో పనిచేశాక 2009లో కన్సర్వేటివ్‌ పార్టీలో చేరడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.

2010లో జరిగిన ఎన్నికల్లో బ్రోమ్స్‌గ్రోవ్‌ నుంచి ఎంపీగా గెలిచారు. 2015లో మళ్లీ గెలిచి డేవిడ్‌ కామెరూన్‌ మంత్రివర్గంలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. గత ఏడాది థెరిసా మే మంత్రి వర్గంలో హోంమంత్రి అయ్యారు. బ్రిటన్‌లో తొలిసారి ఈ పదవి నిర్వహించిన మైనార్టీగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. తాజాగా ఆర్థిక మంత్రిగా మరో ప్రస్థానాన్ని ప్రారంభించారు.

  • Loading...

More Telugu News