Ram: 63 కోట్లు రాబట్టిన 'ఇస్మార్ట్ శంకర్'

  • హిట్ మూవీగా 'ఇస్మార్ట్ శంకర్'
  • 9 రోజుల్లో 63 కోట్ల వసూళ్లు
  • ఆనందాన్ని వ్యక్తం చేసిన చార్మీ

రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్'తో మాస్ ఆడియన్స్ కి విందు భోజనం దొరికినట్లయింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా తన జోరును కొనసాగిస్తూ వస్తోంది. రామ్ మాస్ డైలాగ్స్ .. మాస్ బీట్స్ .. హీరోయిన్స్ గ్లామర్ ఈ సినిమా వసూళ్లలో ప్రధానమైన పాత్రను వహిస్తున్నాయి.

ఈ సినిమా విడుదలైన 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల గ్రాస్ ను సాధించింది. ఈ విషయాన్ని చార్మీ స్వయంగా తెలియజేస్తూ, వసూళ్లకు సంబంధించిన పోస్టర్ ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ సినిమా సాధిస్తోన్న వసూళ్ల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసింది. మొత్తానికి 'ఇస్మార్ట్ శంకర్' ఒక రేంజ్ లో దుమ్ము దులిపేస్తూ వస్తున్నాడు. మరి ఈ సినిమా వసూళ్లపై 'డియర్ కామ్రేడ్' ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి మరి.

  • Loading...

More Telugu News