Andhra Pradesh: కలాం బోధనలు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయి!: ఏపీ సీఎం జగన్
- నేడు కలాం వర్ధంతి
- నివాళులు అర్పించిన ఏపీ సీఎం
- ఆయన సేవలు ఎల్లప్పుడూ గుర్తుంటాయని వ్యాఖ్య
భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆయనకు నివాళులు అర్పించారు. సైన్స్, టెక్నాలజీ రంగానికి కలాం అందించిన సేవలు చిరస్మరణీయమనీ, వాటిని భారతీయులు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. కలాంజీ బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూ ఉంటాయని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా కలాంను జగన్ భారత మిస్సైల్ పితామహుడిగా అభివర్ణించారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ లో స్పందించారు. భారత రాష్ట్రపతిగా తప్పుకున్నాక ఎక్కువ సమయం విద్యార్థులకు పాఠాలు చెప్పడంలో కలామ్ గడిపారు. ఇందులో భాగంగా 2015, జూలై 27న ఐఐఎం షిల్లాంగ్ లో ప్రసంగిస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.