Andhra Pradesh: పొనుగుపాడులో నేడు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన.. 144 సెక్షన్ విధించిన పోలీసులు!

  • టీడీపీ మద్దతుదారుల ఇళ్లకు వెళ్లే దారిలో గోడ
  • అడ్డుగా నిర్మించిన వైసీపీ నేతలు
  • పరిశీలించేందుకు వెళ్లనున్న టీడీపీ కమిటీ

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొనుగుపాడు గ్రామంలో పోలీసులు ఈరోజు 144 సెక్షన్ విధించారు. ఈ ఊరిలో టీడీపీ మద్దతుదారుల ఇంటికి వెళ్లే దారికి అడ్డంగా వైసీపీ నేతలు గోడ కట్టారన్న కథనాల నేపథ్యంలో అక్కడ పర్యటించేందుకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సిద్ధమయింది. ఈరోజు పొనుగుపాడుకు కమిటీ రానున్న నేపథ్యంలో పోలీసులు ముందుజాగ్రత్తగా 144 సెక్షన్ విధించారు. ఈ వ్యవహారంపై గత నెల 19న టీడీపీ మద్దతుదారులు ఫిరంగిపురం పోలీసులను ఆశ్రయించారు. దీంతో గోడ నిర్మాణాన్ని ఆపేయాలని వైసీపీ నేతలకు పోలీసులు స్పష్టం చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.

Andhra Pradesh
Guntur District
Telugudesam
fact finding committee
144 section
ponugodu
  • Loading...

More Telugu News