Sonu Sood: మహిళా అభిమాని కోరికను మన్నించి శ్రీలంక వెళ్లిన సోనూసూద్

  • అభిమాని వివాహం కోసం దేశం దాటిన సోనూ
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో
  • ప్రశంసలతో ముంచెత్తుతున్న నెటిజన్లు

ఓ మహిళా అభిమాని కోరిక తీర్చేందుకు సోనూసూద్ శ్రీలంక వెళ్లడం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. తన వినూత్న నటనా శైలితో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సోనూసూద్, ఓ అభిమాని కోరికను మన్నించి ఆమె వివాహం కోసం శ్రీలంక వెళ్లాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తన ఇన్‌స్టా గ్రాం ఖాతాలోనూ సోనూసూద్ ఆ ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోను చూసిన అభిమానులు సోనూసూద్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అభిమానులు ఇంటి వద్దకు వెళితేనే నటులు బయటకు వచ్చి పలకరించడం కష్టం. అలాంటిది ఏకంగా దేశం దాటి వెళ్లిన సోనూసూద్‌ గురించి తెలుసుకుని అభిమానులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.

Sonu Sood
Sri Lanka
Fan
Marriage
Social Media
Instagram
  • Loading...

More Telugu News