BJP: బీజేపీ కమిట్‌మెంట్‌తో పని చేస్తుంటే.. మిగతా పార్టీలు కరప్షన్‌తో పని చేస్తున్నాయి: సోము వీర్రాజు

  • అధికారుల్ని శాసించే సంస్కృతి మంచిది కాదు
  • ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది
  • కుటుంబ పాలన నియంత్రణే బీజేపీ ధ్యేయం

బీజేపీ కమిట్‌మెంట్‌తో పని చేస్తుంటే, మిగతా పార్టీలు కరప్షన్‌తో పని చేస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ పాలనను గౌరవప్రదంగా నిర్వహించాలని, కేసులు పెట్టే, అధికారుల్ని శాసించే సంస్కృతి మంచిది కాదన్నారు. తమ పార్టీకి ఏపీ ప్రజలు ఓట్లు వేయకపోయినప్పటికీ, అన్ని రాష్ట్రాలతో పాటే ఏపీ అభివృద్ధికి కూడా కేంద్రం సహకారం అందిస్తుందని సోము వీర్రాజు తెలిపారు. కుటుంబ పాలన నియంత్రణే బీజేపీ ధ్యేయమని తెలిపారు. బీజేపీ అన్ని రాష్ట్రాలకు విస్తరించడంతో పాటు అధికారాన్ని సాధించాలన్నదే పార్టీ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

BJP
Somu Veerraju
Jagan
Andhra Pradesh
Central Government
  • Loading...

More Telugu News