Pawan Kalyan: పొలిట్ బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీలను నియమించిన జనసేన అధినేత

  • పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకున్న పవన్
  • నాదెండ్ల మనోహర్ చైర్మన్‌గా పొలిటికల్ అఫైర్స్ కమిటీ
  • క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా మాదాసు గంగాధరం

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం కొన్ని రోజులపాటు మౌనంగా వున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం పార్టీ పటిష్టానికి నడుం బిగించారు. నాదెండ్ల మనోహర్ చైర్మన్‌గా 12 మంది సభ్యులతో పొలిటికల్ అఫైర్స్ కమిటీని రూపొందించారు. అలాగే నలుగురు సభ్యులతో పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా మాదాసు గంగాధరంను నియమించారు.

ఇక పొలిటిబ్యూరోలో నాదెండ్ల మనోహర్‌తో పాటు రాజు రవితేజ్, పి.రామ్మోహన్‌రావు, అర్హంఖాన్‌లను నియమించారు. పొలిటికల్ అఫైర్స్‌ కమిటీలో కొణిదెల నాగబాబు, రాపాక వరప్రసాద్, కోన తాతారావు, పాలవలస యశస్విని, మనుక్రాంత్‌రెడ్డి, బి. నాయకర్, తోట చంద్రశేఖర్, కందుల దుర్గేష్, ముత్తా శశిధర్, పసుపులేటి హరిప్రసాద్‌, ఎ. భరత్‌ భూషణ్‌ ఉన్నారు.

Pawan Kalyan
Naga babu
Nadendla Manohar
P. Rammohanrao
Arham Khan
Raju Ravitej
  • Loading...

More Telugu News