karimnagar: రాజకీయ ప్రయోజనాల కోసం నా మాటలను వక్రీకరిస్తున్నారు: అక్బరుద్దీన్ ఒవైసీ

  • ఎవరి మనోభావాలు దెబ్బతినేలా తాను మాట్లాడలేదు
  • నాడు తన వ్యాఖ్యల వల్లే ముస్లిం ప్రజల్లో ధైర్యం పెరిగింది
  • ఆర్ఎస్ఎస్ ఇంకా భయపడుతోంది

కరీంనగర్ లో ఇటీవల నిర్వహించిన బహిరంగ సభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ వివరణ ఇచ్చారు. ఎవరి మనోభావాలు దెబ్బతినేలా తాను మాట్లాడలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం తన మాటలను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. ‘ఒక్క పదిహేను నిమిషాలు వదిలిపెట్టండి, హిందూ, ముస్లిం జనాభా నిష్పత్తిని సమానం చేస్తాను’ అంటూ  గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆరోజు ఆ వ్యాఖ్యలు చేయడం వల్లే ముస్లిం ప్రజల్లో ధైర్యం పెరిగిందని, అప్పటి నుంచీ ఆర్ఎస్ఎస్ ఇంకా భయపడుతోందని వ్యాఖ్యానించారు. 

karimnagar
mim
akbaruddin
bjp
  • Loading...

More Telugu News