Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్.. స్పీకర్ కు నమస్కారం పెట్టిన చంద్రబాబు!

  • కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • చంద్రబాబుకు మైక్ ఇవ్వకపోవడంపై టీడీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం
  • అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులు ఈరోజు వాకౌట్ చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తమ నాయకుడు చంద్రబాబుకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పీకర్ తమ్మినేని సీతారాంకు నమస్కారం పెట్టి బయటకు వచ్చేశారు.

ప్రస్తుతం స్పీకర్ ఛాంబర్ వద్ద టీడీపీ సభ్యులు నిరసన తెలియజేస్తున్నారు. మరోవైపు టీడీపీ సభ్యుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఏపీ మార్కెటింగ్ బిల్లుతో పాటు ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందేముందు కావాలని గొడవపెట్టుకుని టీడీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రతీరోజూ టీడీపీ సభ్యులు రిపీట్ చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

Andhra Pradesh
Telugudesam
WALK OUT
Chandrababu
Telugudesam mlaS
YSRCP
  • Loading...

More Telugu News