Andhra Pradesh: బీజేపీలోకి రండి.. మన ప్రభుత్వం వచ్చాక మంత్రిని చేస్తాం: బుద్ధా వెంకన్నకు సోము వీర్రాజు ఆఫర్!

  • తిరస్కరించిన టీడీపీ ఎమ్మెల్సీ
  • టీడీపీతో కలిసి పనిచేయాలని సోము వీర్రాజుకు ఆహ్వానం
  • తెలుగుదేశం గెలిచాక కేబినెట్ లోకి తీసుకుంటామని హామీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో ఈరోజు ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీ లాబీలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, బీజేపీ నేత సోము వీర్రాజు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరాలని బుద్ధా వెంకన్నను వీర్రాజు ఆహ్వానించారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రిని చేస్తామన్నారు. బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవని స్పష్టం చేశారు.

దీంతో బుద్ధా వెంకన్న సోము వీర్రాజుకు రివర్స్ ఆఫర్ ఇచ్చారు. ‘మీరే మాతో కలిసి పనిచేయండి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కేబినెట్ లోకి తీసుకుంటాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కొద్దిసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Andhra Pradesh
Telugudesam
BJP
budda venkanna
somu verraju
assembly
cabinet
  • Loading...

More Telugu News